Back

Choose Song To View The Lyrics

అయిదురొట్టెలు రెండు చేపలు తెచ్చాడు

అయిదురొట్టెలు రెండు చేపలు తెచ్చాడు చిన్నోడు
ప్రభుయేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు
చిన్న నాటనే ప్రభుమాటల రుచినెరిగిన ఆ మంచోడు

1. ఆకలి బాధను ఎరిగిన శిష్యులు - ప్రభువు నొద్దకు వచ్చారు
ప్రజలను ఇంటికి పంపెయ్యండని - ప్రభువును వేడారు

2. అన్ని ఎరిగిన ఆ ప్రభువు - మీరే పెట్టండన్నారు
ఏమి తోచక శిష్యులు అచ్చట - తెల్లబోయి నిలిచారు

2. అక్కరనెరిగి ఆ చిన్నోడు - ఆహారం ఆంద్రెయకిచ్చాడు
ప్రభువు వాటిని ఆశీర్వదించి - ప్రేమతో పంచండన్నారు

3. పంక్తులుతీర్చి కూర్చోబెట్టి - శిష్యులువాటిని పంచారు
అయిదువేలప్రజల ఆకలి తీరగ - పన్నెండు గంపలకెత్తారు

5. ప్రభుచేతికి ఇచ్చినవాడు - బహుఘనుడై నిలిచాడు
దేవుని ప్రేమను ఎరిగిన వాడు - నేటికీ నిలిచేవున్నాడు