Back

Choose Song To View The Lyrics

ఈ శుభ దినమున నవ దంపతులను

ఈ శుభ దినమున నవ దంపతులను
దీవించగా దేవా శుభప్రదమున రావా
వధువు వరుడు జంటను చూడు
మీ దీవెనలతో నింపుము నేడు
కళ్యాణ వైభోగమే - ఇది కానాను వివాహమే

మంటిని తీసి నరునిగ చేసి
నీలో సగమని నారిని చేసితివి
సుఖ దుఃఖములలో ఈ వధూవరులను
ఒకరికి ఒకరని దీవించుము దేవా
||కళ్యాణ వైభోగమే||

కానా ఊరిలో అక్కరలెరిగి
ద్రాక్షారసముగ మార్చెను నీళ్లను
కలిమి లేమిలో ఈ దంపతులను
కొరతలు తీర్చి నడుపుము ప్రభువా
||కళ్యాణ వైభోగమే||
** ENGLISH LYRICS **

ee subha dinamuna nava dampathulanu
deevinchaga deva subhapradamuna raavaa
vadhuvu varudu jantanu chuudu
mee deevenalatho nimpumu nedu
kalyana vaibhogame - idi kaanaanu vivaahame

mantini teesi naruniga chesi
neelo sagamani narini chesitivi
sukha dukkamulalo ee vadhuvarulanu
okariki okarani deevinchumu deva
||kalyana vybhoogame||

kaana oorilo akkaralerigi
draksharasamuga marchenu neellanu
kalimi lemilo ee dampathulanu
korathalu tirchi nadupumu prabhuva
||kalyana vybhoogame||

------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals by : SP Charan & Sireesha Baghavatula
Written, Composed & Music by : Symonpeter Chevuri