Back

Choose Song To View The Lyrics

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతము
మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ
||కఱుణా||

1. పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు
తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక
||కఱుణా||

2. కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ
ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము
||కఱుణా||

3. పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది
బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని
||కఱుణా||

4. మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక
తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక
||కఱుణా||

5. కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర
లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ
||కఱుణా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Karunaayutham Bau Kaaryamulu Kanabadavalegaadaa Manalo Anavaratamu
Mana Brathuku Prabhunikai Ankithamagunatu Nalavarachukonaga
||Karunaa||

1. Porugavaani Premintamu Manamu Korathallanni Yika Dheerunu Manaku
Tharugupaddadhaa Gunamadhi Manalo Thvarithagathini Savarinchukondhamika
||Karunaa||

2. Kunti Gruddi Kushthu Rogulendaro Kanthameththi Ghoshingchuchu Nunda
Intagudichi Sukhiyinchuta Nyaayamava Vantabattadadhi Swaartha Parvathamu
||Karunaa||

3. Panduvanti Kaapurambu Manadhi Dandiprabhudu Dhayachaesenu Manakadhi
Bandu Lodhalau Odhalau Bandlau Mundhla Kireetamu Mundhu Bettukoni
||Karunaa||

4. Manujulandhu Galavu Rendu Tegalu Vinumu Pucchukonedhuvaari Dhoka
Tega Manasu Dheera Nicchuvaaridhoka Tega Ganuma Manasa Neevendhugalavo Yika
||Karunaa||

5. Karuna Rasamu Maakuprabhuvaa Kaluganu Krupaa Nimmaa Yepudu Aramara
Laekanu Anni Samayamula Nandara Premanu Joodaga Nadupuma
||Karunaa||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------