Back

Choose Song To View The Lyrics

ప్రేమకే ప్రతిరూపము నీవే నా ప్రాణము

ప్రేమకే ప్రతిరూపము - నీవే నా ప్రాణము (2)
నీ ప్రేమే శాశ్వతం - నీ మాటే అమృతం (2)
నా జీవితం నీకంకితం - నా ప్రియ యేసయ్య

నే నడిచే దారిలో - నా తోడువై
నే పీల్చేగాలిలో - నా శ్వాసవై
నీ చేతి నీడలో నన్ను కాచావే
నీ గుండె లోతుల్లో నన్ను దాచావే

నన్ను వీడని - నా కన్న తండ్రివి
నన్ను మరువని - నా కన్న తల్లివి
నిన్ను మరచిన - నీ చేయి విడచినా
నన్ను విడువని - యేసయ్య

గురిలేని వేళలో - నా గమ్యమై
దరిలేని దారిలో - నా దీపమై
నా చింతలన్నియు - నీవే తీర్చావే
నే కోరిన రేవుకు - నన్ను చేర్చావే

నన్ను కోరుకున్న - నా పరమ తండ్రివి
నన్ను విడువనన్న - నా మంచి కాపరి
నీవే నా గురి - నాకున్న ఊపిరి
నీవే నా ప్రాణం యేసయ్య
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

--------------------------------------------------------------
CREDITS : Music : Bro. Sudeep (Sunny)
Lyrics, Vocals : Dr.Sathish Kumar
--------------------------------------------------------------