Back

Choose Song To View The Lyrics

ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం

ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం (2)
నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని (2)
||ఆనందం||

లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగివచ్చాడు
అంధకార బంధకాలు అంతరింప చేయుటకు ఆశ్చర్యకరుడైనాడు (2)
నెరవేరే ప్రవచనమే రక్షకుడు పుడతాడని
ధన్యమాయే ధరనిఅంతా యేసయ్యను పూజింపగను (2)
నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని
||ఆనందం||

నరకమును తప్పించి నరులను కాపాడా నరునిగా జన్మించాడు
మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడై ఇలా పుట్టాడు (2)
ఆశ్రయమే ఆధారమే అందరికి ప్రభుడాయెనే
భూజనమా హృదినివ్వుమా అదియేగా నిజమైన క్రిస్మస్ (2)
నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని
||ఆనందం||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

--------------------------------------------------------
CREDITS : Music : Bro KY Ratnam
Lyrics, Vocals : Sis Snigdha Ratnam
--------------------------------------------------------