Back

Choose Song To View The Lyrics

ఆత్మ నియమము ద్వారా

ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము
విశ్వాసమునకు కర్తయు దానిని
కొనసాగించు యేసుని జూచుచు
ఓపికతో మనము సాగి పోవుదము

1. భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమున
ఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము

2. సిద్ధపరచిన పురమును - జేర వాగ్దానములను
నమ్మి నడిచిన అబ్రహాము వలె - సాగి పోవుదము

3. ఘోరమైనయా జారత్వమునకు - దూరముగాను
పారిపోయిన - యోసేపుని బోలి సాగి పోవుదము

4. దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు
భోగము విడిచిన మోషేవలె మనము సాగి పోవుదము

5. పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమును
బోధించిన పేతురు వలె మనము సాగి పోవుదము

6. పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించి
పానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము

7. తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగ
ప్రాణము విడిచిన - స్తెఫనువలె మనము సాగి పోవుదము
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Will Update Soon....

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------