Back

Choose Song To View The Lyrics

ఎంతో రమ్యంబైనది భూతలమందు

ఎంతో రమ్యంబైనది భూతలమందు ఎంతో మాన్యంబైనది చెంత జేరి
యేసు వింత పాదాబ్జముల సంతసంబున పూజసల్పు క్రైస్తవ గృహము
||ఎంతో||

1. పిల్ల లొలీవ మొక్కలై బల్లల చుట్టు ఎల్లప్పుడు ఆడుచున్ నుల్లమందున
యేసు చల్లని వాక్యంబున్ నెల్ల వేళల దలచి నుండుచుండెడి గృహము
||ఎంతో||

2. తల్లిదండ్రు లైక్యత దనరుచునుండి దాక్షిణ్య నిధుల జిల్కి ఎల్లప్రేమామృత
మెల్ల వారల కొసగి కల్లోలములు వీడి నుల్లసిల్లెడి గృహము
||ఎంతో||

3. పొరుగువారల మైత్రిని పొందుగ గోరి పొలుపారు నీతిన్ దనరు
నురుతరనాత్మ వరముల పైని గురిపించు వరదాత యేసున్ ప్రార్థించు
క్రైస్తవ గృహము
||ఎంతో||

4. శోధనల నన్నింటిని సర్వదా పైచి శోభిల్లు విశ్వాసమున్ మోద మొందగ
యేసునాధు నందున నిల్పి సాదరంబుగ సాక్ష్యమిడెడు క్రైస్తవ గృహము
||ఎంతో||

5. వ్యర్థ ఖర్చుల మానుచు వర్ధిల్లు కొలది సర్దుకొని జీవించుచున్ వృద్ధి
నొందెడు వేళ శ్రద్ధాభక్తులతో డా ఇద్ధరిత్రిని దశమభాగ మొసగెడు గృహము
||ఎంతో||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Entho Ramyambainadhi Bhoothalamandhu Entho Maanyambainadhi Chentha Jeri
Yesu Vintha Paadhaabjamula Santhasambuna Poojasalpu Kraisthava Gruhamu
||Entho||

1. Pilla Loleeva Mokkalai Ballala Chuttu Ellappudu Aaduchun Nullamandhuna
Yesu Challani Vaakyambun Nella Velala Dhalachi Nunduchundedi Gruhamu
||Entho||

2. Thallidhandru Laikyatha Dhanaruchunundhi Dhaakshinya Nidhula Jilki Ellapremaamrutha
Mella Vaarala Kosagi Kallolamulu Veedi Nullasilledi Gruhamu
||Entho||

3. Poruguvaarala Maithrini Ponduga Gori Polupaaru Neethin Dhanaru
Nurutharanaathma Varamula Paini Guripinchu Varadhaatha Yesun Praardhinchu
Kraisthava Gruhamu
||Entho||

4. Shodhanala Nannintini Sarvadhaa Paichi Shobhillu Vishwaasamun Modha Mondhaga
Yesunaadhu Nandhuna Nilpi Saadharambuga Saakshyamidedu Kraisthava Gruhamu
||Entho||

5. Vyardha Kharchula Maanuchu Vardhillu Koladhi Sardhukoni Jeevinchuchun Vruddhi
Nondedu Vela Shraddhaabhakthulatho Daa Iddharithrini Dashamabhaaga Mosagedu Gruhamu
||Entho||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------