Back

Choose Song To View The Lyrics

ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా

ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జిహ్వార్పణ

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా

గోతిలోనికి దిగిన - మన్ను నిన్ను స్తుతించునా?
గళమెత్తి పాడగలనా - మృతుల లోకానా?
సజీవులు సజీవులే - నిన్ను స్తుతియించెదరు
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా

నిరీక్షణే లేక - కలవరము చెందగా
అడుగులు తడబడగా - ఆప్తులే దూరమైన
వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు

ఇన్నాళ్లకైనా - ఫలములు కాయకున్న
ప్రేమతో నీవిచ్చిన - వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

--------------------------------------------------------------
CREDITS : Music : Pranam Kamlakhar
Lyrics, Tune, Vocals : Dr.Asher Andrew
--------------------------------------------------------------