Back

Choose Song To View The Lyrics

చూడుమదే నీ కొరకే సిలువపై

చూడుమదే నీ కొరకే
సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్

1. నలుగ గొట్టబడి నీకై - పలుకకుండె మారుగా
శిరస్సున రక్తధారలు విరిచె రెక్కలను గ్రుచ్చ
నీ పాపమే, పాదములను - చీల్చెను, బల్లెమై ప్రక్కన్ బొడిచె

2. రక్తసిక్తమై మోము - ఎఱ్ఱనయ్యె కొయ్యపై
చూడు వీపున దున్నెను - దీనునిగా జేసె నీ పాపమే
ప్రభు రక్తము ఏరులై - పారెను, నీ కొరకే సిలువపై

3. గాయమైన చేతులన్ - దినమెల్ల చాపెనో పాపీ
చూచుచుండె ప్రేమతో - నీకై కన్నెటిని కార్చుచు
తన కృపతో, సంధించును - పాపి నిను, చేరుచెంతన్ నీక్షణమే

4. ఎంతకాల మేడ్పించి - వెలుపలనుంతు వతనిని
తెరువు హృదయ ద్వారమున్ - పొందు మారుమనస్సును
ఈ దినమే, నీ పాపముల్ క్షమియించును - నీకిచ్చు సురక్షణను
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Choodumadhae Nee Korakae
Siluvapai Vraelaadu Sreeyaesu Rakshakuni

1. Naluga Gottabadi Neekai - Palakukunde Maarugaa
Shirassuna Rakthadhhaaralu Viriche Rekkalanu Gruccha
Nee Paapamae, Paadhamulanu - Cheelchenu, Ballemai Prakkan Bodiche

2. Rakthasikthamai Momu - Erranayye Koyyapai
Choodu Veepuna Dhunnenu - Dheenunigaa Jaese Nee Paapamae
Prabhu Rakthamu Aerulai - Paarenu, Nee Korakae Siluvapai

3. Gaayamaina Chaethulan - Dhinamella Chaapeno Paapee
Choochuchunde Praematho - Neekai Kannetini Kaarchuchu
Thana Krupatho, Sandhinchunu - Paapi Ninu, Chaeruchentan Neekshanamae

4. Enthakaala Maedpinchi - Velupalunthu Vathanini
Theruvu Hrudhaya Dhwaaramun - Pondu Maarumanassunu
Ee Dhinamae, Nee Paapamul Kshaminchunu - Neekicchu Surakshananu

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------