Back

Choose Song To View The Lyrics

అతి సుందరుడవు యేసయ్య మనోహరుడవు నీవయ్యా

అతి సుందరుడవు యేసయ్య
మనోహరుడవు నీవయ్యా
యదార్థవంతుల సభలో పరిశుద్ధులుతో కలిసి
నిన్ను ఆరాధించెను అతిసుందరుడా మనోహరుడా
ఆరాధనకు యోగ్యుడవు స్తుతులకు పాత్రుడవు

నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు
కృపా క్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలవు
నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను
పరవశించి పరవళ్లు త్రొక్కి ఆరాధించెదను
||అతి సుందరుడవు||

అమూల్యమైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించి యున్నావు
విశ్వాసముతో ఓర్పు గలిగి వాగ్దానమును పొందెదను
సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను
||అతి సుందరుడవు||

మహారాజువై సీయోనులో ఏలుచున్నావు
పునాదులు గల పట్టణము కట్టుచున్నావు
సౌందర్యము గల సీయోనులో ప్రకాశించుచున్నావు
నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను
అతిసుందరుడా..... మనోహరుడా....
ఆరాధనకు యోగ్యుడవు స్తుతులకు పాత్రుడవు
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Athi Sundharudavu Yesayya Manoharudavu Neevayya
Yadhaarthavanthula Sabhalo Parishuddhulatho Kalasi
Ninu Aaraadhinchedanu
Hallelujah Hallelujah Hosanna Aaraadhana

Nee Sannidhilo Sampoornamaina Santhoshamu Kaladhu
Krupaakshemamulu Nee Mandhiramulo Samruddhigaa Kalavu
Ne Dheenudanai Nee Sannidhini Anubhavinchedhanu
Paravasinchi Paravalluthokki Aaraadhinchedanu
||Athi Sundharudavu||

Amulyamulaina Vaagdhaanamulu Anugrahinchaavu
Athyadhikamugaa Asheervadhinchi Hechinchiyunnaavu
Viswaasamutho Orpu Kaligi Vaagdaanamune Pondhedhanu
Sampoornathakai Parishuddhudanai Aaraadhinchedhanu
||Athi Sundharudavu||

Mahaaraajuvai Seeyonulo Eluchunnaavu
Punaadhulugala Pattanamunu Kattuchunnaavu
Soundharyamugala Seeyonulo Prakaasinchuchunnaavu
Nee Mahimanu Pondhi Nee Dharicheri Aaraadhinchedhanu

--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------