Back

Choose Song To View The Lyrics

మాయ లోకము మోసపోకుము

మాయ లోకము - మోసపోకుము
యేసునందే రక్షణ దొరుకును నీకు

1. బంధుమిత్రులు - భార్య బిడ్డలు - ధనము ఘనము అందచందము
అవి అన్నియును - నీటిబుడగలె సమాధితోనే - సమాప్తమౌను

2. పడగ విప్పిన - పామువలె నీ - పాపము నిన్ను వెంబడించును
పాప ఫలితము - మరణమేగదా దాని అంతము నిత్యనరకము

3. నిన్ను రక్షింపనెంచి ప్రభువు - పరమును విడచి - ధరకువచ్చెను
నీకు బదులుగా - శ్రమల నోర్చెను - సిలువలోనే బలియాయె నేసు

4. ఇప్పుడైనను - ఒప్పుకొనుమిక - నీ పాపజీవితము నంతయు
నిన్ను క్షమించును కృపతో ప్రభువు - ఇదియే నీ రక్షణ దినముగా

5. దేహమంత ప్రభు గాయముల్ పొందె - పరిశుద్ధ రక్తమును
కార్చెను - నిత్యజీవము నీకు నీయను - మృతిని గెల్చి తిరిగిలేచెను
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Maaya Lokamu - Mosapoakumu
Yesunandhe Rakshana Dhorukunu Neeku

1. Bandhumithrulu - Bhaarya Biddalu - Dhanamu Ghanamu Andhachandhamu
Avi Anniyunu - Neetibudagale Samaadhithone - Samaapthamounu

2. Padaga Vippina - Paamuvale Nee - Paapamu Ninnu Vembadinchunu
Paapa Phalithamu - Maranamegadhaa Dhaani Anthamu Nithyanarakamu

3. Ninnu Rakshimpanenchi Prabhuvu - Paramunu Vidachi - Dharakuvachchenu
Neeku Badhulugaa - Shramala Norchenu - Siluvalone Baliyaaye Nesu

4. Ippudainanu - Oppukonumika - Nee Paapajeevithamu Nanthayu
Ninnu Kshaminchunu Krupatho Prabhuvu - Idhiye Nee Rakshana Dhinamugaa

5. Dehamantha Prabhu Gaayamul Pondhe - Parishuddha Rakthamunu
Kaarchenu - Nithyajeevamu Neeku Neeyanu - Mruthini Gelchi Thirigilechenu

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------