Back

Choose Song To View The Lyrics

ఓ దేవ నేను నీ దాపున నుండెదన్

ఓ దేవ నేను నీ దాపున నుండెదన్ నీ దాపున నుండెదన్ నా దేవ
నను లేపు నవి సిల్వ శ్రమలైనన్ నీ దాపున నుండు నీ సేవకుని పాట
||ఓ దేవ||

1. బాటసారి లాగు నేఁడు భానుఁడు గ్రుంకి మేటి చీఁకటి గ్రమ్మినన్
నేటి విశ్రాంతికిఁ జోటు బండయైనన్ మాటిమాటికిఁ గలలో సూటిగా
నినుఁదలఁతు
||ఓ దేవ||

2. ఆకాశ మండల మార్గంబు నెప్పుడు నా కీవు చూపించుమా నీ
కూర్మిచే నాకుఁ జేకూరు నంతయు లోకేశ్వర దూత లే కోరి ననుఁ
బిలువ
||ఓ దేవ||

3. నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని ప్రాకటంబగు నెనరుతో
భీకరము లైన శోకంబు లను రాళ్లన్ నీకు నాలయంబు నేఁగట్టె దను
గర్తా
||ఓ దేవ||

4. సంతసంపు రెక్క లెత్తి నాకమునందు నెంత పైకి లేచినన్ వింతగ
జ్యోతుల వితతి మించి నేన త్యంత మెగసినను నీ చెంత కేగును బాట
||ఓ దేవ||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

O Deva Nenu Nee Dhaapuna Nundedhan Nee Dhaapuna Nundedhan Naa Deva
Nanu Lepu Navi Silva Shramalainan Nee Dhaapuna Nundu Nee Sevakuni Paata
||O Deva||

1. Baatasaari Laagu Naedu Bhaanudu Grunki Meti Cheekati Gramminan
Neti Vishraanthiki Chotu Bandayainan Maatimaatiki Kalalo Sootigaa
Ninu Dhalathu
||O Deva||

2. Aakaasha Mandala Maargambu Neppudu Naa Keevu Choopinchumaa Nee
Koormiche Naaku Chekooru Nanthayu Lokeshwara Dhootha Lae Kori Nanu
Biluva
||O Deva||

3. Neeku Sthothramu Chesi Yapudu Naa Madhiloni Praakatambagu Nenarutho
Bheekaramu Laina Shokambu Lanu Raallan Neeku Naalayambu Nae Gatte Danu
Garthaa
||O Deva||

4. Santhasampu Rekka Letthi Naakamunandhu Nentha Paiki Lechinan Vinthaga
Jyothula Vithathi Minchi Naena Thyantha Megasinanu Nee Chentha Kaegunu Baata
||O Deva||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------