Back

Choose Song To View The Lyrics

దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి

దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁ
కమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా
||దినము||

1. సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా
దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము
||దినము||

2. కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెం
గట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు
||దినము||

3. తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేము
వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి
||దినము||

4. ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము
మాకు సామర్ధ్యమొసఁగితివి వంద నమ్ము దేవ
||దినము||

5. ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ
నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము
||దినము||

6. అలసిన మా దేహములకు వలసిన నిదురఁ గలుగఁజేసి నీదూ
తల హస్తములలో మమ్ములను దాఁచుము భద్రముగను దేవ
||దినము||

7. అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాఁచి మమ్ము
త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ
||దినము||

8. దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి
సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుఁగాక
||దినము||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Dinamu Gathiyinchenu Dinanaadhuda Paraadri Venukadaage Ni
Kamaa Munimaapu Samsthavamun Gonumu Sampreethimai Ghanuda Devaa
||Dinamu||

1. Saravinambaraveedhi Sanja Kenjaayalu Muruvunjoope Prabhuvaa
Dhoramu Nee Mukhakaanthi Kirana Jaalamu Maapai Nerraparammu
||Dinamu||

2. Katiki Cheekatulu Dikthathamula Galipiyu Thkatamulaina Nee Chen
Gata Nunna Netti Sankatameny Mammu Thaakutaku Janku
||Dinamu||

3. Thalapuvalananu Noti Palukuvalananu Jenati Panulavalla Memu
Valachi Chesina Paapamula Nella Khamiyimpuma Laghakshaanthi
||Dinamu||

4. Mummarammagu Shodhanamulapai Vijayamunondha Nee Dinammu
Maaku Saamardhyamosagithivi Vandhanammu Deva
||Dinamu||

5. Ee Dinamu Maaku Sammodhambutho Nichchi Yaadukonna Varamou
Nee Divyadhaanamula Kai Deva! Maa Kruthagnathanu Gommu
||Dinamu||

6. Alasina Maa Dehamulaku Valasina Nidura Galugajesi Needhoo
Thala Hasthamulalo Mammulanu Daanchumu Bhadramuganu Deva
||Dinamu||

7. Arunodhayamunaninnarchinchu Koraku Nee Karamu Saachi Mammu
Thwaragaa Melkolpumu Swaasthya Pradhaathavai Paramadeva
||Dinamu||

8. Dhaatha Veeve Loka Thraatha Veeve Maaku Netha Veeve Yesu Neethi
Sooryundavi Khyaathi Mahimalu Neeke Kalugugaaka
||Dinamu||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------