Back

Choose Song To View The Lyrics

దేవుడే మహిమ విడచి భువిపై మనకై వెలిసే

దేవుడే మహిమ విడచి
భువిపై మనకై వెలిసే
ఇమ్మానుయేలుగా - మన తోడు ఉండుటకై
తన కిష్టులైన ప్రజకు - సమాధానం ఇచ్చుటకు
క్రిస్మస్ ఆనందం - తెచ్చే సంతోషం
ప్రతి హృదయంలో - రక్షణానందం (2)

1. దూతలే - పాడిరి - సర్వోన్నత మైన స్థలములలో
దేవునికి - మహిమ - భువిపై సమాధానము (2)
గొల్లలే గంతులేసి - జ్ఞానులు శిరసు వంచి - ఆరాధించిరి
హృదయాలు తెరచి - మనసారా పాడేదం -
ఏసురాజు వచ్చెనని
||క్రిస్మస్ ఆనందం||

2. వాక్యమే రూపమై - మన మధ్యలో - నివాసముండెను
పాపికి రక్షణ క్షమాపణ - ఇచ్చుటకు (2)
తండ్రితో - కోల్పోయిన - స్నేహము దొరికెను - ఈ దినమే
పశుశాలలో పవళించెను - ప్రేమతో నిను చేరుటకే
||క్రిస్మస్ ఆనందం||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------