Back

Choose Song To View The Lyrics

దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం

దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం
కష్టమైన శోధనైన నిన్ను పాడెదన్
నిన్ను స్తుతియించెదన్

నావా ఒంటరిగా సాగుచుండగా నాధా నిన్నే పాడెదను
జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను
శతకోటి పాటలు నిను గూర్చిపాడిన
నా ఆశ ఎన్నటికి తీరదయా
కడవరకు నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణనాధుడా నా జీవనాధుడా
||దేవా||

దేహమంతా కృషియించిన వాడి నశియించిపోయిన
రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను
క్షణమైనా నిన్ను స్తుతియింప మరచిన
జీవిత పయనము వ్యర్ధమయ్యా
జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణనాధుడా నా జీవనాధుడా
||దేవా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------