Back

Choose Song To View The Lyrics

క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివరించెద

క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివరించెద వినరే ప్రియులార వాస్తవముగ
మరణించి బ్రతికెనని వసుధలోఁ బ్రకటింపరె యూరూరఁ
||క్రీస్తు||

1. మరియ మగ్దలేనెకుఁ బ్రథమంబున మన గురువర్యుం డగపడియెఁ
తరుణీమణులకు రెండవ మాఱొక దర్శనము దయతో నిడియెఁ
||క్రీస్తు||

2. సీమో నను పేతురును గూడ ద ర్శించె నతఁడు మూఁడవ మాఱు
ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకుఁ బ్రియ మొనరించె మఱొక తీఱు
||క్రీస్తు||

3. తోమాలేని తరుణమునఁ బదుగురి తో వచించె గృహమునఁ జేరి
తోమాకు కనపడి యతని సంశయముఁ దొలఁగించెను బ్రభుఁ డొకసారి
||క్రీస్తు||

4. సందరంపు దరి నేడుగురికి మ త్స్యంబులు వింతగ సమకూర్చె
సందర్శించియు యాకోబునకును సంతోషము నెంతయుఁ గూర్చెఁ
||క్రీస్తు||

5. ప్రభుఁ డొక మాఱే నూరుగురిఁ దాఁ బ్రత్యక్షుం డయ్యెను పేర్మి నషయ
మొసంగి యపొస్తలులకుఁ క్రీ స్తారోహణుఁ డయ్యెను గూర్మిఁ
||క్రీస్తు||

6. హత్యఁ జేయు నేగెడు తార్సీయున కగపడి రక్షించెను సుమ్ము
మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో దృశ్యుం డగు నిది సత్యమ్ము
||క్రీస్తు||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Kreesthu Prabhuni Prathyakshathalanu Vivarinchedha Vinarae Priyulaara Vaasthavamuga
Marananchi Brathikenani Vasudhalo Prakatimpare Yoorooran
||Kreesthu||

1. Mariya Magdhalaineku Prathamambuna Mana Guruvaryun Dagapadiye
Tharuneemanulaku Rendava Maarokka Dharshanamu Dhayatho Nidiye
||Kreesthu||

2. Seemo Nanu Pethurunu Gooda Dharshince Nathaedu Moodava Maaru
Premathoda Nimmaayi Shishyulaku Priya Monarince Marokka Theeru
||Kreesthu||

3. Thomaalaeni Tharunamuna Padhuguri Tho Vachince Gruhamuna Jaeri
Thomaku Kanapadi Yathani Samshayamu Tholaginchenu Prabhu Dokasaari
||Kreesthu||

4. Sandharampu Dhari Naedhuguriki Mathsyambulu Vinthaga Samakoorche
Sandharshinchiyu Yaakobunaku Santhoshamu Nenthayu Koorche
||Kreesthu||

5. Prabhu Doka Maarae Nooriguri Dhaa Prathyakhsun Dhayyenu Paermi Naxaya
Mosangi Yaposthalulaku Kreesthaarohanun Dhayyenu Koormi
||Kreesthu||

6. Hathyan Jaeyu Naegedu Thaarseeyuna Kagapadi Rakshinchenu Summu
Mruthyunjayu Dippudu Mana Kaathmalo Dhrushyun Dagu Idhi Sathyammu
||Kreesthu||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------