Back

Choose Song To View The Lyrics

ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు

ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు (2)
మనస్సే మందిరమాయె - నా మదిలోదీపము
నీవే నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలేనే
నిరంతరం నీ మాటతో - ప్రకాశింపజేయుదువు
||ప్రేమే||

1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తనక్షేత్రము (2)
ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను
ఉండలేను - బ్రతుకలేను
నీ తోడు లేకుండా - నీ నీడ లేకుండా
||ప్రేమే||

2. కమ్మనైనా నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో (2)
కరువు సీమలో సిరులోలికించెను - నీ వాక్య ప్రవాహము
గగనము చీల్చి మోపైన దీవేన వర్షము కురుపించితివి
ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా - వర్ణింప తరమా
||ప్రేమే||

2. విధిరాసిన విషాదగీతం సమసిపోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి (2)
మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్టులతో యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాడమైన ప్రేమ నీకు మరువలేను యేస్సయ్య
||ప్రేమే||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

------------------------------------------------
CREDITS : Hosanna Ministries
------------------------------------------------