Back

Choose Song To View The Lyrics

నిను మాత్రమే నే నమ్మానయా

నిను మాత్రమే నే నమ్మానయా
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా
నీ బాహుబలమే నడిపించును
నా స్థితులన్నిటిని సరిచేయును
కృప చూపువాడవయా నీ పిల్లలకు

నీవు సెలవియ్యగా కలుగనిదేముంది
వాక్కును పంపగా జరుగనిదేముంది
సకలము నీదెనయా శ్రీమంతుడా
స్తుతి నీకు పాడెదనయా
సమకూర్చువాడవయా నీ పిల్లలకు

నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు
కార్యము చేయగా అడ్డుపడువాడెవడు
యుద్ధము నీదెనయా ఓ శూరుడా
ముందుకు సాగెదనయా
జయమిచ్చువాడవయా నీ పిల్లలకు

నీవు కరుణించగా కాదనువాడెవడు
శక్తితో నింపగా ఓడించువాడెవడు
సాయము నీదెనయా సహాయకుడా
నీలో దాగెదనయా
బలమిచ్చువాడవయా నీ పిల్లలకు