Back

Choose Song To View The Lyrics

నీవేయని నమ్మిక నీవేయని నమ్మిక యేసు

నీవేయని నమ్మిక (2)
నీవేయని నమ్మిక యేసు
నా మార్గము సత్యము జీవము సర్వము నీవే
నా మార్గము సత్యము జీవము నా సర్వము నీవే
||నీవేయని నమ్మిక||

దారి తప్పిన నాకు నిరీక్షణాస్పదమైతివే (2)
నీవే నా ఆశ్రయం నీవే నా అతిశయం (2)
ఘనమైన నీ ప్రేమను నిత్యము స్తుతింతును యేసు
ధన్యమౌ నా మార్గము
||నీవేయని నమ్మిక||

నిన్ను చేరిన నాకు అతిశయాస్పదమైతివే (2)
నీవే నా రక్షణ నీవే నా నిరీక్షణ (2)
దివ్యమైన నీ స్నేహం ఘన మోక్షమార్గము యేసు
ధన్యమౌ నా జీవితం
||నీవేయని నమ్మిక||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

----------------------------------------------------
CREDITS : Vocals : Nissy John
Lyrics : Rev.P.Emmanuel Devadas
----------------------------------------------------