Back

Choose Song To View The Lyrics

నీవే నా నీడ తోడువై యుంటివి నా యేసయ్యా

నీవే నా నీడ తోడువై యుంటివి నా యేసయ్యా (2)
నీవే నా తోడునీడవై యుంటివి (2)
భయపడను నేను ఏనాటికి
నిలిచెదను యేసు నీ సాక్షిగా (2)
||నీవే నా తోడునీడవై||

1. కాలమెదురు తిరిగినా
కారుచీకటి కమ్మినా (2)
పదివేలమంది పైబడినను
నీవే నా బలము ధైర్యము (2)
||నీవే నా తోడునీడవై||

2. జలములలోబడి నే వెళ్ళినా
అగ్నిలో నే నడచినా (2)
నీ బాహువే నన్ను రక్షించును
విడువవు నను ఎడబాయవు (2)
||నీవే నా తోడునీడవై||

3. నిందలెన్ని నిలిచినా
అవమానమే క్రుంగదీసినా (2)
నా తలను పైకెత్తువాడవు నీవే
ఆనందముతో నిన్ను
స్తుతియింతును (2)
||నీవే నాతోడునీడవై||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------