Back

Choose Song To View The Lyrics

నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని

నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని
ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి
ఇది నా చివరి ఇది నా కడవరి
మిగిలియున్న నిరీక్షణా - మిగిలియున్న నిరీక్షణా
మిగిలియున్న నిరీక్షణా

పాపపు ఊబిలో పాతుకుపోయిన
పాపపు తీగెలో అల్లుకుపోయిన (2)
పాత రోత జీవితాన్ని (2)
పవిత్ర పరుచుము పరిశుద్ధుడా
పవిత్ర పరుచుము పరమాత్ముడా
||నీ మాటలతో||

చితికిన బ్రతుకు చీదరి తనువు
చిక్కులలోనా చిక్కిన నన్ను (2)
చేరదీసి సేదదీర్చుము (2)
చేతనైన పరిశుద్ధుడా - చేతనైనా పరమాత్ముడా
||నీ మాటలతో||

----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Prema Chalunaya (నీ ప్రేమ చాలునయా)
----------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **