Back

Choose Song To View The Lyrics

నీ ప్రేమలో నన్నుంచయ్యా

నీ ప్రేమలో నన్నుంచయ్యా
నీ దయలోన నీ కృపలోన నడిపించు ప్రభువా (2)
అ.ప:ఇదే నా అభిలాష-ఇదే నా హృదయవాంఛ (2)

1. గడచిన కాలమంత కృపలో దాచినావు
నూతనవత్సరం మా కొసగినావు (2)
నీ కృపలను నే తలంచు పాడెద
ఆయుష్కాలమంతా మరువక స్తుతించెదన్‌ (2)
నీ నామముననే ఇల కీర్తించెదన్‌ (2)
||ఇదే||

2. నా మనవులను అంగీకరించినావు
నా కోరికను సిద్ధింపడేసావు (2)
నీ మేలు నేను మరువక చాటెదా
నా బ్రతుకంతయు నిన్ను మహిమపరచెద (2)
నీ సాక్షిగానే ఇల జీవించెద (2)
||ఇదే||

3. నూనెతో నా తల అభిషేకించినావు
శోభాతిశయముగా నన్ను మార్చినావు (2)
ఈ ధన్యతకై నిను ఘనపరచెద
నా పూర్ణ ఆత్మతో ఆరాధించెద (2)
నీ పర్ణశాలలో నే నిలిచి ఉండెద (2)
||ఇదే||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------